రాయలసీమ ప్రాజెక్టులపై వైసీపీ విష ప్రచారం..

Update: 2026-01-17 05:37 GMT

రాయలసీమ అంటే కేవలం ఒక ప్రాంతం కాదు.. ఎన్నో ఏళ్లుగా నీటి కోసం, అభివృద్ధి కోసం పోరాడుతున్న ప్రజల ఆశ. అలాంటి రాయలసీమకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం గట్టి భరోసా ఇస్తోంది. ప్రాజెక్టులు, డ్యామ్‌ల మరమ్మతులు, నీటి నిల్వల భద్రత విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తోంది. కానీ ఈ ప్రయత్నాలను చూసి ఓర్వలేక వైసీపీ పార్టీ తప్పుడు ప్రచారాలకు దిగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాయలసీమ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. గత ప్రభుత్వాలు పట్టించుకోని అంశాలను ఒక్కొక్కటిగా పరిష్కరించే దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం భారీగా నిధులు కేటాయిస్తూ, పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీశైలం డ్యామ్ పవర్ జనరేషన్ కోసం ఖాళీ అవుతున్నా పెద్దగా స్పందించలేదు. డ్యామ్ భద్రత, నీటి నిల్వల నిర్వహణపై నిర్లక్ష్యం వహించారు జగన్. తుంగభద్ర ప్రాజెక్టును కూడా పట్టించుకోలేదు. ఇవే రాయలసీమ ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి కారణమయ్యాయి. అంతేకాదు, జగన్ సీఎంగా ఉన్నప్పుడు బీఆర్‌ఎస్ ప్రభుత్వంతో లోకాయపారి ఒప్పందాలు చేసుకుని.. రాయలసీమకు అన్యాయం చేశారనే విషయం బహిరంగ రహస్యమే.

ఇప్పుడు పరిస్థితి మారింది. కూటమి ప్రభుత్వం శ్రీశైలం డ్యామ్ మరమ్మతుల కోసం ఏకంగా రూ.200 కోట్లు మంజూరు చేసింది. ఇది కేవలం సంఖ్య కాదు.. డ్యామ్ భద్రతకు, రాయలసీమ భవిష్యత్తుకు ఇచ్చిన హామీ. అలాగే తుంగభద్ర బ్యారేజ్ (టీబీ) గేట్ల మరమ్మతుల కోసం రూ.20 కోట్లు మంజూరు చేసి సీఎం నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవన్నీ ప్రాజెక్టుల పట్ల ప్రభుత్వానికి ఉన్న కమిట్‌మెంట్‌ను స్పష్టంగా చూపిస్తున్నాయి.

ఇంత చేస్తున్నా కూడా వైసీపీ పార్టీ మాత్రం రాయలసీమ ప్రాజెక్టులపై విష ప్రచారం చేస్తోంది. కూటమి పట్టించుకోవట్లేదని సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన రాతలు రాయిస్తోంది వైసీపీ బ్యాచ్. రాయలసీమ కోసం కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రికార్డులే చెబుతున్నాయి. నిధుల కేటాయింపులు, పనుల ఆమోదాలు, ఫీల్డ్ లెవల్‌లో జరుగుతున్న అభివృద్ధి అవన్నీ ప్రజలకు కనిపిస్తున్నాయి. కాబట్టి వైసీపీ ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు.

Tags:    

Similar News