ఉమ్మడి అనంతపూర్ కు మహర్దశ..

Update: 2025-12-13 05:20 GMT

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని జిల్లాల్లో పెట్టుబడుల కోసం కృషి చేస్తోంది. మరీ ముఖ్యంగా వెనుకబడిన జిల్లాల్లో పరిశ్రమలు వచ్చేలా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలు ఫలిస్తున్నాయి. అనంతపూర్ కు మనం వైసిపి పాలనలో పెట్టుబడులు రావడం చూసామా. కానీ ఇప్పుడు మాత్రం అంతర్జాతీయ స్థాయి కంపెనీలతోపాటు జాతీయ స్థాయి ప్రభుత్వ కంపెనీలు కూడా ఇక్కడకు వచ్చి పెట్టుబడులు పెడుతున్నాయి. ఇదంతా సీఎం చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాల వల్లే జరుగుతోంది. ఆయన ముందుచూపుతో వెనుకబడిన జిల్లాలకు మహర్దశ తీసుకొస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో కీలక ప్రాజెక్టులు రెడీ అవుతున్నాయి. ఏరోస్పేస్ ఇండస్ట్రీ కోసం చిలమత్తూరు వద్ద సెజ్ ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం.

ఇంకోవైపు మడకశిరలో మెగా సోలార్ ప్రాజెక్టు కోసం కేబినెట్ ఆమోదం తెలపడంతో 8500 కోట్ల పెట్టుబడులతో 5800 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. త్వరలోనే రక్షణ రంగానికి సంబంధించి కీలక శంకుస్థాపనలు జరగబోతున్నాయి. ఈ కీలక ప్రాజెక్టులు రావడంతో ఉమ్మడి అనంతపూర్ అభివృద్ధిలో కీలక ముందడుగు పడనుంది. లోకల్ గా ఉండే యువతకు ఉద్యోగాలు భారీ స్థాయిలో రాబోతున్నాయి. గత వైసిపి పాలనలో రాయలసీమ జిల్లాలను జగన్ పట్టించుకున్న పాపాన పోలేదు. అందుకే ఆయనను ఇక్కడ కూడా అత్యంత దారుణంగా ఓడ గొట్టి కూటమికే పట్టం కట్టారు.

ఈ రోజుల్లో కావాల్సింది డైలాగులు కాదు కదా. అన్ని ప్రాంతాలకు అభివృద్ధి మాత్రమే ఇప్పుడు చూస్తున్నారు. ఆ అభివృద్ధి కేవలం సీఎం చంద్రబాబు నాయుడుతో సాధ్యమవుతుందని ఉద్దేశంతోనే ఏపీ ప్రజలు ఇప్పుడు కూటమికి ఇంత స్థాయిలో మెజార్టీ ఇచ్చారు. అందుకు తగ్గట్టే సీఎం చంద్రబాబు నాయుడు హయాంలో ఇంటర్నేషనల్ కంపెనీలు వస్తుండటం చూస్తూనే ఉన్నాం. అటు విశాఖతో పాటు ఇటు రాయలసీమ జిల్లాల వరకు అన్ని రకాల పరిశ్రమలు రావడంతో ప్రజలు చాలా సంతోషంలో ఉన్నారు.

Tags:    

Similar News