ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ ఏడీజీ కుమార్ విశ్వజిత్‌లతో సీఎస్ జవహర్‌రెడ్డి భేటీ అయ్యారు. ఎన్నికల అనంతరం హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ కావటంతో యాక్షన్ లోకి దిగారు. ఉన్నత అధికారులు అత్యవసరంగా సమావేశమయ్యారు.
గురువారం ఈసీ వద్ద వివరణ ఇచ్చేందుకు సీఎస్, డీజీపీలు దిల్లీ వెళ్లనున్నారు. ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు జరిగేలా పాలనా వ్యవస్థ విఫలం కావడానికి కారణాలేమిటని ఇప్పటికే ఈసీ ప్రశ్నించింది.
ఈ ఘటనలకు బాధ్యులు ఎవరు? నివారణ చర్యలు ఏం తీసుకున్నారని సీఎస్, డీజీపీలను ఈసీ వివరణ కోరింది. ఈ అంశాలపై చర్చించేందుకు డీజీపీ, సీఎస్, ఇంటెలిజెన్స్ ఏడీజీలు అత్యవసరంగా భేటీ అయ్యారు.