Elephants : కుప్పంలో ఏనుగుల బీభత్సం

Update: 2024-05-31 10:52 GMT

ఉమ్మడి చిత్తూరు జిల్లా కుప్పంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. కుప్పం మండలం వసనాడు, నడుమూరు, గొనుగురు, మరుకుపల్లి, గ్రామంలో రెండు ఏనుగులు హల్చల్ చేశాయి.

రైతులు పండించిన పంటలను తొక్కి నాశనం చేశాయి.వసనాడు గ్రామంలో శాంతారామ అనే రైతు టమోటో తోటను పూర్తిగా తొక్కి నాశనం చేశాయి. ఏనుగుల సంచారం వార్త సమీప గ్రామాలను భయకంపితులను చేస్తోంది.

మామిడి తోటలను ధ్వంసం చేసిన ఏనుగులు.. రైతులకు నష్టం చేశాయి. దీంతో.. ఫారెస్ట్ డిపార్టుమెంట్ రంగంలోకి దిగింది. ఏనుగులను రోడ్డు మళ్లించే ప్రయత్నం చేశారు అటవీశాఖ అధికారులు.

Tags:    

Similar News