వింజమూరులోని ప్రభుత్వ వైద్యశాలలో నూతనంగా ఏర్పాటుచేసిన డయాలసిస్ సెంటర్ ను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ డయాలసిస్ సెంటర్ ను కోటి 50 లక్షలుతో నూతనంగా నిర్మించారు. వింజమూరులోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో డయాలసిస్ సెంటర్ ను ఐదు పడకలతో ప్రారంభించారు. ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రాంలో భాగంగా 42 సెంటర్లను కేటాయించగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవతో రాష్ట్రానికి 18 డయాలసిస్ సెంటర్లను 10 నెలల కాలంలో ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి సత్య కుమార్ తెలిపారు. మెట్టు ప్రాంతమైన వింజమూరులో డయాలసిస్ సెంటర్ ని ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. నియోజకవర్గం లో డయాలసిస్ పేషెంట్లు 80 మంది ఉన్నారని వారికి మెరుగైన వైద్యం కోసం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్లో 65 కోట్లు డయాలసిస్ విభాగానికి కేటాయించడం జరిగిందని మంత్రి తెలిపారు.