Driver Subramanyam: డ్రైవర్ సుబ్రమణ్యం డెత్ సర్టిఫికెట్‌పై మరో వివాదం..
Driver Subramanyam: ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రమణ్యం హత్యకేసు రోజుకో మలుపు తిరుగుతుంది.;
Driver Subramanyam: ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రమణ్యం హత్యకేసు రోజుకో మలుపు తిరుగుతుంది. తాజాగా.. సుబ్రమణ్యం డెత్ సర్టిఫికెట్‌పై మరో వివాదం చెలరేగింది. హత్య కాకినాడలోనే చేసినట్లు అనంతబాబు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. అయితే.. డెత్ సర్టిఫికెట్ గొల్లలమామిడాడలో ఇవ్వాలని పంచాయతీ సెక్రెటరీపై ఉన్నతాధికారులు ఒత్తిడి తెస్తున్నారు. అక్కడ కేవలం సుబ్రమణ్యం అంత్యక్రియలు మాత్రమే జరిగాయి.
పెదపూడి ఎమ్మార్వో మాత్రం గత నాలుగు రోజులుగా పంచాయతీ సెక్రెటరీని డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలని అడుగుతున్నా.. ఇవ్వడం లేదని ఆర్డీవోకి రాసిన లేఖ వెలుగులోకి వచ్చింది. ఏ ప్రాంతంలో అయితే చనిపోయారో అక్కడే డెత్ సర్టిఫికెట్ ఇస్తారు. అయితే.. గొల్లలమామిడాడ పంచాయతీ సెక్రెటరీని అడగడం వెనుక కుట్ర కోణం ఉందని పలువురు అనుమానిస్తున్నారు. కేసు మాఫీలో భాగంగానే ఇది జరుగుతుందని అంటున్నారు. అయితే.. కాకినాడలోనే డెత్ సర్టిఫికెట్ జారీ చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.