ఏపీ పోలీసులు కేంద్ర ఎన్నికల సంఘం షాక్‌లో ఉన్నారు. ఏపీ సీఎస్, డీజీపీని ఢిల్లీకి రావాలని ఈసీ సమన్లు జారీ చేయడం పోలీసులపై ప్రభావం చూపుతోంది.
ఐదేళ్ల కాలంలో మొదటి సారి విధి నిర్వహణపై ఏపీ పోలీసులు దృష్టి పెట్టారు. ఈసీ ఆగ్రహంతో కిందిస్థాయి పోలీసులు అప్రమత్తమయ్యారు.
టీడీపీ నేతలపై దాడి చేసిన నేతలను వరుసగా అరెస్టులు చేస్తున్నారు. పులివర్తి నానిపై దాడి చేసిన 11మందిని అదుపులోకి తీసుకున్నారు. తాడిపత్రిలో జేసీ ఇంటికి భద్రతను పెంచారు. అలాగే డీఎస్పీ చైతన్యపై పోలీసు శాఖ చర్యలు తీసుకుంది.