EC: వాలంటీర్లతో పింఛన్ల పంపిణీ వద్దు
ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు.... టెట్, డీఎస్సీ నిర్వహణ వాయిదా;
వాలంటీర్లకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను దూరంగా ఉంచాలన్న ఈసీ... అన్ని నగదు పంపిణీ పథకాల నుంచి వాలంటీర్లను దూరంగా ఉంచాలని స్పష్టంచేసింది. వాలంటీర్లతో నగదు పంపిణీ చేయించవద్దని సీఈవోను.... ఈసీఐ ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కోడ్ ముగిసేవరకు వాలంటీర్ల ట్యాబ్, మెుబైల్‌ను.... కలెక్టర్ల వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించింది. నగదు పంపిణీ పథకాల్లో ప్రభుత్వ ఉద్యోగులను వాడుకోవాలని సూచించింది. నగదు పంపిణీలో వాలంటీర్ల పాత్ర లేకుండా చూడాలని హైకోర్టులో సీఎఫ్‌డీ వేసిన పిటిషన్‌తో పాటు ఆ సంస్థ ఫిర్యాదును కూడా పరిగణనలోకి తీసుకున్నామని ఈసీ తెలిపింది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో టెట్ ఫలితాల విడుదల, DSC పరీక్షల నిర్వహణపై.... కేంద్రం ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు టెట్ ఫలితాలతో పాటు DSC పరీక్షలను వాయిదా వేయాలని ఆదేశించింది.గత ఐదేళ్లలో ఒక్కసారిగా కూడా టెట్, DSC నిర్వహించని వైకాపా.. ఎన్నికల ముందు రెండింటికి ఒకేసారి నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో తగినంత సమయం లేదని అభ్యర్థులు.. ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఇరువైపుల వాదనలు విన్నా ధర్మాసనం..... DSC, టెట్‌కు మధ్య కనీసం 4వారాల గడువు ఉండాలని ఆదేశించింది. ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 30వరకు DSC పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ...... రీ షెడ్యూల్ చేసింది. ఇంతలో ఎన్నికల కోడ్ రావడంతో..... టెట్ ఫలితాల విడుదలకు, DSC నిర్వాహణకు ఈసీ అనుమతిని కోరుతూ అధికారులు ఈసీకి లేఖ రాశారు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు టెట్ ఫలితాలతో సహా DSC పరీక్షలను వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా వైసీపీ దాష్టీకాలు కొనసాగుతున్నాయి. నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలో తెలుగుదేశం పార్టీ ప్రచారంలో పాల్గొన్నందుకు ఓ జనసైనికుడి పూరిల్లుని కూల్చేశారు. కోవూరు నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి ఈ నెల 27న విడవలూరు మండలం రామచంద్రాపురం గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో స్థానిక జనసేన కార్యకర్త కృష్ణ, అనిత దంపతులు పాల్గొన్నారు. దీంతో కక్షసాధింపు చర్యలకు దిగిన వైకాపా నాయకులు, గతంలో ఇంటి నిర్మాణానికి తాము ఇచ్చిన నాలుగు స్తంభాలూ ఇచ్చేయేమంటూ గద్దించారు. ఆపై ఇంటిని కూల్చేసి.... నాలుగు స్థంభాలనూ పట్టుకువెళ్లారు. విషయం తెలుసుకున్న జనసేన నేతలు బాధితులను పరామర్శించి వైసీపీ తీరుపై ఆగ్రహం చేశారు. బాధితుడికి అన్నివిధాలా అండగా ఉంటామని ప్రకటించారు.