AP: ఏపీలో తప్పుల తడకగా ఓటర్ల లిస్ట్
ఆదోనిలో ఒకే ఇంట్లో 706 నకిలీ ఓట్లు, 222వ పోలింగ్ కేంద్రంలో అవకతవకలు;
ఏపీలో నకిలీ ఓట్లు వెలుగు చూస్తునే ఉన్నాయి. ఇప్పటికే అనేక జిల్లాలో నకిలీ ఓట్లు జాబితా బయటపడగా తాజాగా కర్నూలు జిల్లా అదోనిలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ఆదోనిలో ఓటర్ల జాబితాలో భారీగా తప్పులతడకలు ఉన్నట్లు గుర్తించారు. 17 వార్డు లోని 222 వ పోలింగ్ కేంద్రం పరిధిలో అవకతవకలు చోటు చేసుకున్నాయి. ఇంటి నెంబర్ 17లో 644 ఓట్లు ఉండటం విస్మయానికి గురిచేస్తోంది. ఇక పోలింగ్ స్టేషన్ 223 పరిధిలోనూ ఇదే పరిస్థితి. ఇంటి నెంబర్ 17/836 లో ఏకంగా 706 ఓట్లు బయట పడ్డాయి. ఒకే ఇంట్లో వందల సంఖ్యలో నకిలీ ఓట్లు బయటపడటంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. జాబితాలో చనిపోయిన వారి పేర్లు కూడా తొలగించలేదు.
2019 ఎన్నికల వరకూ ఓటర్ల జాబితా బాగానే ఉన్నా ఆ తర్వాత భారీగా ఓట్లు జాబితాలో నమోదు అయ్యాయి.అనేక వార్డుల్లో భారీగా దొంగ ఓట్లు ఉన్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితమే అధికారులు 10 వేల వరకూ ఓట్లను జాబితా నుంచి తొలగించారు. జాబితా ను ప్రక్ష్యాలన చేయడంలో అధికారులు విఫలం చెందరన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దొంగఓట్లను తొలగించాలంటూ టీడీపీ ఇంచార్జ్ మీనాక్షి నాయుడు, సీనియర్ టీడీపీ నేత ఉమాపతి నాయుడు డిమాండ్ చేశారు. ఓడిపోతారని తెలిసే... వైసీపీ ఇలాంటి అక్రమాలకు తెరతీసిందని మండిపడ్డారు.