Srikakulam District : అఖండ సినిమా చూస్తుండగా ఒక్కసారిగా థియేటర్‌లో చెలరేగిన మంటలు..!
Akhanda : పలాస-కాశీబుగ్గ పట్టణంలో షార్ట్ సర్క్యూట్ సంభవించింది. అఖండ సినిమా ప్రదర్శిస్తున్న రవిశంకర్ థియేటర్‌లో సౌండ్ సిస్టమ్‌లో షార్ట్ సర్క్యూట్ జరిగింది.;
Akhanda : పలాస-కాశీబుగ్గ పట్టణంలో షార్ట్ సర్క్యూట్ సంభవించింది. అఖండ సినిమా ప్రదర్శిస్తున్న రవిశంకర్ థియేటర్‌లో సౌండ్ సిస్టమ్‌లో షార్ట్ సర్క్యూట్ జరిగింది. తెరవెనుక ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రేక్షకుల్లో భయభ్రాంతులకు గురయ్యారు. బయటకు పరుగులు తీశారు.మరికొందరు ఏం జరుగు తుందో అర్ధం కాక హాలులోనే ఉండిపోయారు. వెంటనే థియేటర్ సిబ్బంది హుటా హుటిన తెర వెనక వైపునకు వెళ్లి విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రేక్షకులు ఊపిరి పీల్చుకున్నారు.