నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు డివిజన్ పరిధిలోని బైర్లూటి రేంజ్‌లో అడవి దున్న కెమెరా ట్రాప్‌లో కనిపించింది. 1870 తర్వాత అడవి దున్న ఇక్కడ కనిపించడంతో ఫారెస్ట్ సిబ్బంది సైతం ఆశ్చర్యపోతున్నారు. వెలుగోడు రేంజ్‌లో ఈ ఏడాది జనవరిలో మొదటిసారి అడవిదున్నను గుర్తించామని.. అదే అక్కడికి వెళ్లినట్లు పేర్కొన్నారు. ఈ దున్న కర్ణాటక వైపు నుంచి కృష్ణా నదిని దాటి నల్లమలలోకి ప్రవేశించి ఉంటుందని భావిస్తున్నారు. . చివరిసారిగా అడవి దున్న 1870లో కనిపించిందని, ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే అని చెబుతున్నారు.
ఈ జంతువును మొదటిసారిగా ఈ ఏడాది జనవరిలో వెలుగోడు రేంజ్‌లో గుర్తించినట్లు ఆత్మకూరు ఫారెస్ట్ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ సాయిబాబా తెలిపారు. అక్కడ నుంచి అడవి దున్న గత నెలలో బైర్లూటి రేంజ్‌లోకి ప్రవేశించినట్టు పేర్కొన్నారు. అయితే, ఇది కర్ణాటక వైపు నుంచి కృష్ణా నదిని దాటి నల్లమలలోకి ప్రవేశించి ఉంటుందని భావిస్తున్నామని ఆయన అన్నారు.
ఇండియన్ బైనస్గా ప్రసిద్ధి చెందిన ఈ దున్నలు ఒకప్పుడు నల్లమలలో విస్తారంగా సంచరించాయి. కాలక్రమేణా కనుమరుగయ్యాయి. కర్ణాటకలోని పశ్చిమ కనుమలకు మాత్రమే పరిమితమైన ఈ దున్నలు కిలో మీటర్లు దాటుకొని నల్లమలలోకి ప్రవేశించడం అద్భుతంగా భావిస్తున్నామని అధికారులు చెప్పారు.