SIMHACHALAM: ఒకే కుటుంబంలో నలుగురు మృతి

Update: 2025-04-30 05:15 GMT

సింహాచలం చందనోత్సవంలో గోడకూలిన ఘటనలో ఎనిమిది మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, మృతుల్లో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారుగా అధికారులు గుర్తించారు. పిల్లా ఉమామహేశ్, ఆయన భార్య శైలజ, శైలజ తల్లి వెంటకరత్నంతో పాటు మేనత్త మహాలక్ష్మి ఈ ప్రమాదంలో మరణించినట్లు తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని భక్తులు ఆరోపిస్తున్నారు. చనిపోయిన వారిలో పత్తి దుర్గాస్వామినాయుడు(32), ఎడ్ల వెంకట్రావు(48), ఈశ్వరశేషు(28) గా గుర్తించారు. దుర్ఘటనలో పిల్లా మహేష్​(30) అతని భార్య శైలజ(29), ఆమె తల్లి వెంకకటరత్నం(45), మేనత్త జి.మహాలక్ష్మి (65) మృతి చెందినట్లు చెబుతున్నారు. మధురవాడ చంద్రన్న పాలెంలో మహేశ్, శైలజ నివాసం ఉంటున్నారు. శైలజ ఇన్​ఫోసిస్​సిస్​లో సాఫ్ట్​వేర్​ ఇంజనీరుగా పనిచేస్తోంది. మహేశ్​ హెచ్​సీఎల్​లో విధులు నిర్వహిస్తున్నారు. మృతదేహాలను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు కలెక్టర్‌ తెలిపారు.

Tags:    

Similar News