ఏపీలోని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 నుంచి అమల్లోకి రానుందా! ఈ అంశంపై ప్రస్తుతానికి స్పష్టత రావాల్సి ఉంది. ఏపీలో ఓ మంత్రి ప్రకటించి మళ్లీ తన ప్రకటన వెనక్కి తీసుకున్నారు. ఫ్రీ బస్సు విషయాన్ని తెలియజేస్తూ ఏపీ రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. ఆయన తన ట్వీట్ ను కొద్దిసేపటికే డిలీట్ చేయడం చర్చనీయాంశమైంది.
ఒకపక్క మంత్రివర్గం సమావేశం జరుగుతుండగా ఈ విషయం గురించి ఎలాంటి చర్చ జరగకుండానే ఉచిత బస్సు పథకంగా పై మంత్రి ప్రకటించడంపై తీవ్ర చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రిగా ఉండి.. రవాణా శాఖకు సంబంధించిన కీలక అంశంపై అధిష్టానం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకముందే.. ట్విటర్ లో పోస్ట్ పెట్టడం, అది చర్చకు దారి తీయడంతో వెంటనే ఆయన పోస్టు డిలీట్ చేయడం జరిగింది.