టీడీపీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ఏపీలో ఆసక్తి పెరిగింది. దీపావళి పండుగ కానుకగా ఈ పథకం ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం నియోజకవర్గం ఈదుపురం గ్రామంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ దీపం 2 పథకానికి శ్రీకారం చుట్టారు. 29వ తేదీ నుంచి ప్రభుత్వం ఈ పథకం కింద గ్యాస్ బుకింగ్ ప్రారంభమయ్యింది. దీపం-2 పథకంలో భాగంగా ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున ప్రభుత్వం పేద ప్రజలకు ఉచితంగా అందించనుంది. మూడు విడతల్లో ప్రభుత్వం మూడు గ్యాస్ సిలిండర్లకు అయ్యే ఖర్చు సొమ్మును విడుదల చేయనుంది. 29వ తేదీ నుంచి ప్రభుత్వం ఈ పథకం కింద గ్యాస్ బుక్ చేసుకునే అవకాశాన్ని లబ్ధిదారులకు కల్పించింది. గ్యాస్ సిలిండర్ అందిన 48 గంటల్లో లబ్ధిదారులు సిలిండర్‌కు వెచ్చించిన సొమ్ము వారి ఖాతాలో జమ కానుంది. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు మొదటి సిలిండర్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. రెండో విడతలో ఏప్రిల్ 1 నుంచి జులై 30 వరకూ, మూడో విడతలో ఆగస్టు 1 నుంచి నవంబర్ 31 వరకూ, నాలుగో విడత 2025 డిసెంబర్ 1 నుంచి 2026 మార్చి 31 వరకూ బుకింగ్ చేసుకునే సౌకర్యం ప్రభుత్వం కల్పించింది.