Andhra Pradesh: గంగవరం పోర్టు సీఎస్‌ఆర్ కింద రూ.50 లక్షల విరాళం
Andhra Pradesh: విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌కి అదానీ గంగవరం పోర్టు యాజమాన్యం సీఎస్‌ఆర్ కార్యక్రమంలో భాగంగా రూ.50 లక్షల చెక్కును అందజేసింది.;
Andhra Pradesh: విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌కి అదానీ గంగవరం పోర్టు యాజమాన్యం సీఎస్‌ఆర్ కార్యక్రమంలో భాగంగా రూ.50 లక్షల చెక్కును అందజేసింది. దేశంలోనే అత్యంత లోతైన, ఆధునిక ఓడరేవుగా పేరొందిన అదానీ గంగవరం పోర్టు యాజమాన్యం తమ సిఎస్‌ఆర్ కార్యక్రమంలో భాగంగా సోమవారం విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎ. మల్లిఖార్జునకు మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కల్పనకు రూ.50 లక్షల చెక్కును అందజేసారు. ఓడరేవు అధికారులు, అదానీ ఫౌండేషన్‌తో కలిసి, ఓడరేవు చుట్టుపక్కల గ్రామాలలో వైద్య శిబిరాలు నిర్వహించి, ప్రభుత్వ పాఠశాలలతో నిమగ్నమై, విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు.