Andhra Pradesh : ఏపీ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్..త్వరలోనే ప్రమోషన్లు ..
ఏపీలో ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది సంస్థ యాజమాన్యం. ఆర్టీసీలోని అన్ని ర్యాంకుల ఉద్యోగులకు వచ్చే నెలాఖరులోగా పదోన్నతులు కల్పిస్తామని ఆ సంస్థ ఎండీ ద్వారక తిరుమలరావు ప్రకటించారు. కాగా ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అమలు చేయనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉచిత ప్రయాణానికి 74 శాతం బస్సులను కేటాయిస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ తెలిపారు. ప్రయాణికుల సంఖ్య ఆధారంగా పల్లెవెలుగు బస్సులు పెంపు పై నిర్ణయం తీసుకుంటామన్నారు. అదే విధంగా రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరయ్యాయని, మరో 600 బస్సులు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని ద్వారకా తిరుమల రావు తెలిపారు. అలాగే బస్ స్టాండ్ లో మౌలిక సదుపాయా లు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ క్రమంలో ఉద్యోగులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని అందరూ కలిసి సంస్థను లాభాల్లో నడిపించేలా కృషి చేయాలని ఆర్టీసీ ఎండీ కోరారు.