Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు అందని జీతాలు.. అప్పులు దొరికితేనే..
Andhra Pradesh: మే మూడో తేదీ వచ్చినా.. ఇప్పటివరకు ఏపీ ఉద్యోగులకు జీతాలు అందలేదు.;
Andhra Pradesh: మే మూడో తేదీ వచ్చినా.. ఇప్పటివరకు ఏపీ ఉద్యోగులకు జీతాలు అందలేదు. ఎప్పుడు ఉద్యోగుల అకౌంట్‌లో పడతాయో కూడా తెలియని పరిస్థితి. అప్పులు దొరికితేనే ఉద్యోగులకు జీతాలు పడే అవకాశం ఉంది. మరోవైపు ఏపీ సర్కారు అప్పులకు కేంద్రం అనుమతి ఇవ్వడం లేదు. దీంతో కేంద్రం వద్ద ...రాష్ట్ర అధికారులు పడిగాపులు గాస్తున్నారు. అనుమతలు ఇవ్వాలని కోరుతున్నారు. అయితే.. ఇప్పట్లో అనుమతి వచ్చే అవకాశాలు శూన్యం అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. దీంతో ఖజానాకు వచ్చిన నిధుల్ని వచ్చినట్లే జీతాలకు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. విడుతల వారీగా ఉద్యోగులకు జీతాలు అందే అవకాశం ఉందంటున్నారు.