నేడు ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో., ప.గో., ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. కొన్ని చోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు ఉన్నందున ఓటర్లు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
శనివారం కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో 28.2 మిమీ, తిరుపతి జిల్లా పుత్తూరులో 27.2మిమీ, కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో 14 మిమీ చొప్పున వర్షపాతం నమోదైందని తెలిపింది. ఆదివారం కూడా అనేక చోట్ల వర్షాలు కురుస్తాయని, భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు కూడా వీచే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.