840 కేజీలు గంజాయి, పోలీస్ చెక్ పోస్ట్ తప్పించేందుకు రెండు కిలోమీటర్ల కాలినడకన కూలీలతో గంజాయి మోత, సాఫీగా బొలెరో వాహనంలో ఏజెన్సీ దాటిన గంజాయి. కట్ చేస్తే సరుకు అనకాపల్లి జిల్లాలో పోలీసులకు పట్టుబడింది. అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అందించిన వివరాల మేరకు... చింతపల్లి మండలం మామిడి పాలెం గ్రామానికి చెందిన సుక్రీ అర్జున్ తన స్నేహితుడైన కొదమ నాగరాజు, పాంగీ అర్జునరావు, వంతల సురేష్ అను వ్యక్తులతో ఒరిస్సా లోని జనబ ప్రాంతం లో గంజాయి ని కొను గోలు చేసి సమీపంలోని ఉయ్యాల బ్రిడ్జ్ వద్ద బోలెరో వాహనం లో మొత్తం 840 కేజి ల గంజాయిని, 20 బస్తాలతో లోడ్ చేయించి ధారకొండ, చింతపల్లి మీదగా డౌనూరు తీసుకువచ్చి, డౌనూరు చెక్ పోస్ట్ కు ముందు పోలీసులకు దొరకకుండా రెండు కిలోమీటర్ల మేర కూలీల సహాయంతో తోటలలో ఉన్న కాలిబాట ద్వారా మోయించి డౌనూరు చెక్ పోస్ట్ దాటిన తరవాత తిరిగి అదే బోలెరోలో లోడ్ చేశారు. అక్కడినుండి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం, తాళ్ళపాలెం మీదగా కర్ణాటక కు తీసుకువెళ్తుండగా నక్కపల్లి మండలం, వెదుళ్లపాలెం జంక్షన్ వద్ద పోలీసులకు అందిన సమాచారం మేరకు గంజాయిని నలుగురు నిందితులను, పట్టుకోవడం జరిగింది. పట్టుబడ్డ గంజాయి విలువ 42 లక్షలు ఉంటుందని అంచనా.ఈ కేసులో ప్రమేయం ఉన్న ఇతర నిందితులను కూడా పట్టుకోవడానికి ప్రత్యేక టీం ను ఏర్పాటు చేసినట్టు అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు.