Veeranjaneyaswamy : తిరుమల వెంకన్నతో పెట్టుకుంటే వైసీపీకి పుట్టగతులు ఉండవ్ - మంత్రి వీరాంజనేయస్వామి .

Update: 2025-09-17 09:35 GMT

తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిపై రాజకీయాలు చేయడం తగదని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి వైసీపీ నాయకులకు హితవు పలికారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా గతంలో పని చేసిన భూమన కరుణాకర్ రెడ్డికి శ్రీవిష్ణువు, శనీశ్వర విగ్రహాల మధ్య తేడా తెలియదని ఎద్దేవా చేశారు. అలాంటి వ్యక్తి ఆ పదవిలో ఉండటం దౌర్భాగ్యమని ఆయన తీవ్రంగా విమర్శించారు.

"భూమన కరుణాకర్ రెడ్డికి తిరుపతి నేలపై నడిచే అర్హత లేదు. తాను చేసిన తప్పులకు వెంకన్న పాదాలపై పడి క్షమాపణలు చెప్పాలి" అని మంత్రి డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులు నిరంతరం తిరుమలపై విషం చిమ్ముతున్నారని, రాజకీయ స్వార్థం కోసం తప్పుడు ప్రచారాలు చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీయొద్దని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. "వెంకన్నతో పెట్టుకుంటే వైసీపీకి పుట్టగతులు ఉండవు" అని మంత్రి బాల వీరాంజనేయస్వామి హెచ్చరించారు.

Tags:    

Similar News