అల్పపీడన ద్రోణి ప్రభావంతో రేపు రాష్ట్రంలో వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా, NTR, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కడప, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, చెట్లు, పోల్స్, టవర్స్ కింద ఉండొద్దని సూచించింది.
తెలంగాణలోని భద్రాద్రి, ములుగు, భూపాలపల్లి, ఖమ్మం, వనపర్తి, కామారెడ్డి, సంగారెడ్డి, గద్వాల, కరీంనగర్, మహబూబ్ నగర్, వికారాబాద్, మెదక్, నాగర్ కర్నూల్ , నారయణపేట జిల్లాల్లో ఇవాళ, రేపు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు APలోని పలు ప్రాంతాల్లో 3 రోజులు వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. నేడు అల్లూరి, కాకినాడ, డా.బీ.ఆర్.అంబేడ్కర్, తూ. గో, ప. గో, ఏలూరు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో వానలు కురుస్తాయని పేర్కొంది.