YCP: విపత్తు వేళ.. వైసిపి స్వార్థపు రాజకీయం..

Update: 2025-10-30 06:28 GMT

ఏపీలో ఇప్పుడు మొంథా తుఫాన్ బీభత్సానికి అంతా అతలాకుతలం అయిపోయింది. కూటమి ప్రభుత్వం ఎంత పటిష్టమైన చర్యలు తీసుకున్నా సరే ఆస్తి నష్టం భారీగానే జరిగింది. సీఎం చంద్రబాబు ముందస్తు చర్యలు పకడ్బందీగా తీసుకోవడం వల్ల ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. ఎప్పటికప్పుడు అధికారులను అలర్ట్ చేస్తూ పునరావాస కేంద్రాల్లో అత్యంత హైజెనిక్ ఫుడ్, వసతి ఏర్పాట్లు చేయించారు. ఎన్డీఆర్ ఎఫ్‌, ఎస్డీఆర్ ఎఫ్‌ బృందాలు తుఫాన్ నష్టాన్ని ఎప్పటికప్పుడు సరిచేస్తున్నారు. విరిగిన స్తంభాల ప్లేస్ లో కొత్తవి పెడుతున్నారు. చెట్లు పడిపోతే నిముషాల్లోనే క్లియర్ చేస్తున్నారు. హెల్త్, పోలీస్, పారిశుధ్య, రెస్క్యూ బృందాలు ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉంటూ ప్రజలకు సేవలు అందిస్తున్నారు.

సీఎం చంద్రబాబు, లోకేష్, పవన్ అర్ధరాత్రి దాకా ఏర్పాట్లను పరిశీలిస్తూ కీలక ఆదేశాలు ఇస్తున్నారు. కానీ వైసీపీ పార్టీ మాత్రం విష ప్రచారం చేస్తూనే ఉంది. అసలు ఏపీలో తుఫాన్ లేకపోయిన అంతా హడావిడి చేస్తున్నారు. ఎక్కడివో ఫొటోలు తెచ్చి ఇక్కడ ఫేక్ ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీ సోషల్ మీడియా కుట్రలకు తెర తీసింది. కానీ మొంథా తుఫాన్ ప్రభావం జాతీయ మీడియాలో కూడా రావడంతో నాలుక కరుచుకుని.. మళ్లీ ఓ దిక్కుమాలిన పోస్టు పెట్టింది. వైసీపీ అఫిషియల్ సోషల్ మీడియాలో అసలు కూటమి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని తప్పుడు రాతలు రాస్తోంది. ముందు తుఫాన్ లేదని చెప్పిన ఈ బ్యాచ్.. ఇప్పుడు తుఫాన్ కు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని మళ్లీ ఫేక్ పోస్టులు పెడుతోంది.

జగన్ హయాంలో చాలా పకడ్బందీగా జాగ్రత్తలు తీసుకున్నారని, పునరావాస కేంద్రాలు, ప్రత్యేక నిధులు ఇచ్చారని అంతా తప్పుడు రాతలే రాస్తున్నారు వైసీపీ కార్యకర్తలు. గులాబ్ తుఫాన్ వచ్చినప్పుడు జగన్ తాడేపల్లి ప్యాలెస్ దాటి వచ్చాడా.. ఒక్క రివ్యూ పెట్టాడా, ప్రత్యేక నిధులు ఇచ్చాడా.. పునరావాస కేంద్రాలను పరిశీలించాడా, పంట నష్టం అంచనాలను పంపాలని ఆదేశించారా.. అంటే ఒక్కటి కూడా లేదు. కానీ ఇవన్నీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. ఒక రకంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులను వైసీపీ తన సోషల్ మీడియాలో జగన్ చేసినట్టు చెప్పుకుంటోంది. ఓ వైపు ఏపీ అల్లాడిపోతుంటే.. ప్రతిపక్ష పార్టీకి బాధ్యత లేదు. ప్రజల మధ్య ఉంటూ సాయం చేయాల్సింది పోయి.. ఇలాంటి సమయంలో కూడా తప్పుడు ప్రచారాలు చేయడం అంటే.. ఆ పార్టీ విజ్ఞత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

Tags:    

Similar News