AB venkateswara rao : ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ రద్దు
AB venkateswara rao : ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది.;
AB venkateswar rao : ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. వెంటనే సర్వీసులోకి తీసుకోవాలంటూ జగన్ సర్కారుకు ఆదేశాలు జారీ చేసింది.
ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ ఉత్తర్వులే అమలవుతాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఫిబ్రవరి 7వ తేదీతో వెంకటేశ్వరరావు రెండేళ్ల సస్పెన్షన్ ముగిసినట్టేనని, ఫిబ్రవరి 8వ తేదీ నుంచి ఆయనకు ఇవ్వాల్సిన జీతభత్యాలను చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.