Lok Sabha Speaker : లోక్‌సభ స్పీకర్‌గా పురందీశ్వరి‌?

Update: 2024-06-12 05:33 GMT

కీలకమైన లోక్‌సభ స్పీకర్‌ ఎంపికలో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. మిత్రపక్షాలకు ఆ పదవి ఇవ్వడం బీజేపీకి ( BJP ) ఇష్టం లేదని, ఆ పార్టీ ఏపీ చీఫ్ పురందీశ్వరి‌కి ( Purandeswari ) స్పీకర్‌ బాధ్యతలు ఇవ్వాలని చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ఆమెకు మంత్రివర్గంలో చోటు ఇవ్వలేదనే మరో వాదన ఉంది. ఆమెకు ఇస్తే చంద్రబాబూ వ్యతిరేకించలేరనే టాక్ నడుస్తోంది. అయితే ఇందుకోసం నితీశ్(JDU)ను బీజేపీ ఒప్పించాల్సి ఉంటుంది.

ఇక ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్.. మోదీ ప్రభుత్వం మరికొన్ని నెలల్లో కూలిపోతుందని ఆరోపించారు. ఈ ఘటన ఆరు నుంచి ఏడాది లోపు జరుగుతుందని ఆయన ప్రయాగ్ రాజ్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్‌గా మీరు ఎంపీల్లో ఒకరిని ఎంపిక చేసుకోవాలంటూ ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు టీడీపీ, జేడీయూల అధినేతలకు ఆయన హితవు పలికారు. అది కూడా మోదీ ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిసేపటికే ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Tags:    

Similar News