YS Jagan : రేపు కోర్టు ముందుకు జగన్.. చట్టం ముందు అంతా సమానమే..

Update: 2025-11-20 05:15 GMT

వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రేపు సీబీఐ స్పెషల్ కోర్టు విచారణకు వ్యక్తిగతంగా హాజరుకానున్నాడు. ఈ వార్త రాజకీయ వర్గాలను కుదిపేస్తోంది. దాదాపు ఆరేళ్ల తర్వాత ఆయన కోర్టు ముందు ప్రత్యక్షంగా హాజరవుతుండటం ప్రత్యేక చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణం ఆయన గతంలో పొందిన మినహాయింపులు, ఇప్పుడు కోర్టు తీసుకున్న సీరియస్ స్టాండ్, రాజకీయ వాతావరణంలో మారిన పరిస్థితులే. జగన్‌ చివరిసారి వ్యక్తిగతంగా కోర్టుకు వెళ్లి చాలా సంవత్సరాలే అయ్యింది. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికార భారం, భద్రతా ఏర్పాట్లు, పనిభారాలు అంటూ నానా సాకులు చూపించి కోర్టుకు రాకుండా తప్పించుకుని తిరిగాడు.

ప్రతిపక్షాలు ఆయనపై తరచూ ఈ విమర్శను విసురుతూనే వచ్చాయి. “అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోర్టు హాజరు తప్పించుకుంటున్నారు” అని సోషల్ మీడియాలో కూడా వాదన గట్టిగా వినిపించింది. ఇప్పుడు కోర్టు హాజరు తప్పనిసరిగా మారడంతో ఆ విమర్శలు మళ్లీ తీవ్రం అయ్యాయి. సీబీఐ కేసుల్లో విచారణ చాలా కాలంగా సాగుతుండటం, పురోగతి ఆశించినంతగా లేకపోవడం నేపథ్యంలో కోర్టు ఈసారి కఠినంగా వ్యవహరించింది. ప్రత్యేక కోర్టు స్పష్టంగా వ్యక్తిగత హాజరు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

దీంతో జగన్ తప్పనిసరిగా రేపు కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సారి కూడా ఆయన వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోసం చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. పలు కారణాలు చెబుతూ కోర్టును ఒప్పించడానికి యత్నించినా కుదర్లేదు. తప్పులు చేస్తే కోర్టు ముందు అందరూ సమానమే అనే విషయం జగన్ గుర్తు పెట్టుకోవాలి. అంతే గానీ రకరకాల సాకులు చూపిస్తూ తప్పించుకోవాలనుకుంటే ఎలా. ఒక మాజీ సీఎంగా ఉండి పదిమందికి ఆదర్శంగా ఉండాలి గానీ.. ఇలా చేయడం కరెక్ట్ కాదంటున్నారు.


Full View

Tags:    

Similar News