వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్ ( YS Jagan ) నేడు పులివెందులలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన తాడేపల్లిలోని నివాసం నుంచి బయల్దేరుతారు. మూడు రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పార్టీ నేతలు, అభిమానులతో ఆయన సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. జగన్ పులివెందుల పర్యటనతో ఇవాళ వైసీపీ స్పీకర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి దూరంగా ఉంది.
వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేయించారని ఆ పార్టీ చీఫ్ జగన్ చేసిన ట్వీట్ కు టీడీపీ కౌంటర్ ఇచ్చింది. ‘ప్రజల తాగునీటి అవసరాలకు ఉపయోగపడే వాటర్ ప్లాంట్ కట్టకుండా మత్స్యకారుల భూమిని ఆక్రమించి, కబ్జా చేసి కట్టామని సిగ్గు లేకుండా చెప్తున్నాడు. ప్రజల ఆస్తులు కొల్లగొడుతూ నీ ఆక్రమణలు వదిలేయమంటావా? ఇంత పెద్ద డైలాగులు వద్దులే కానీ, ముందు అసెంబ్లీకి వచ్చి పోరాడు’ అని జగన్‌ను ట్యాగ్ చేసింది.
అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జగన్‌ను అగౌరవపరిచారంటూ తమ పత్రికలో వార్త రాయించిన భారతిరెడ్డి ఇప్పటికైనా చెత్త రాతలు ఆపాలని టీడీపీ ట్వీట్ చేసింది. ‘మీ భర్త ప్రతిపక్ష నేత హోదానీ ప్రజలు పీకేశారు. ఇప్పుడు అతను 175 మందిలో ఒక సాధారణ ఎమ్మెల్యే మా సైకో తట్టుకోలేడని మీ వైసీపీ ఎమ్మెల్యే లు వేడుకుంటే మంత్రుల తర్వాత చంద్రబాబు అవకాశం ఇచ్చారు. లేదంటే అక్షర క్రమంలో మీ పులివెందుల ఎమ్మెల్యే చిట్టచివర ప్రమాణం చేసేవాడు’ అని కౌంటర్ ఇచ్చింది.