JAGAN: చంద్రబాబు చావు కోరుకుంటున్న వైఎస్ జగన్

చంద్రబాబు దేంట్లోనైనా దూకి చావాలి... మళ్లీ వైఎస్ జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు

Update: 2025-09-11 03:30 GMT

ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో రై­తు­లు ఎదు­ర్కొం­టు­న్న ఎరు­వుల కొ­ర­త­పై మాజీ ము­ఖ్య­మం­త్రి, వై­సీ­పీ అధి­నేత జగన్ తీ­వ్ర­స్థా­యి­లో ధ్వ­జ­మె­త్తా­రు. ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు సొంత ని­యో­జ­క­వ­ర్గ­మైన కు­ప్పం­లో కూడా రై­తు­లు ఎరు­వుల కోసం బా­రు­లు తీ­ర­డం సి­గ్గు­చే­ట­ని, ఈ అవ­మా­నం భరిం­చ­లేక ఆయన దేం­ట్లో­నై­నా దూకి చా­వొ­చ్చు అంటూ సం­చ­లన వ్యా­ఖ్య­లు చే­శా­రు. తా­డే­ప­ల్లి­లో­ని పా­ర్టీ కేం­ద్ర కా­ర్యా­ల­యం­లో ఏర్పా­టు చే­సిన మీ­డి­యా సమా­వే­శం­లో ఆయన మా­ట్లా­డు­తూ.. రా­ష్ట్రం­లో అసలు ప్ర­భు­త్వం ఉందా? అనే సం­దే­హం కలు­గు­తోం­ద­ని వి­మ­ర్శిం­చా­రు. రై­తుల తర­ఫున మేం ని­ర­స­న­లు చే­స్తే ఏం తప్పు అని అడు­గు­తు­న్నా.. ఎరు­వు­లు దొ­ర­క్క రై­తు­లు ఇబ్బం­దు­లు పడు­తుం­టే మా­ట్లా­డ­కూ­డ­దా అన్నా­రు. ప్ర­జా­స్వా­మ్యం కూని కా­వ­టం వల్లే ఈ పరి­స్థి­తి ఏర్ప­డిం­ది. మీరు రై­తు­ల­కు అం­ది­వ్వా­ల్సిన ఎరు­వు­లు అం­ది­స్తే ఈ పరి­స్థి­తి ఉం­డ­దు కదా అన్నా­రు. రు­వుల కోసం రై­తు­లు రా­త్ర­నక, పగ­ల­నక పను­లు మా­ను­కు­ని ఎదు­రు చూ­డా­ల్సిన వచ్చిం­ది.. అర్ధ­రా­త్రి సమ­యం­లో వె­ళ్లి క్యూ లై­న్లో వేచి చూ­డా­ల్సిన పరి­స్థి­తి తలె­త్తిం­ది.. కనీ­సం కు­ప్పం­లో కూడా చం­ద్ర­బా­బు రై­తు­ల­కు ఎరు­వు­లు ఇవ్వ­లే­క­పో­యా­రు అని జగన్ మో­హ­న్ రె­డ్డి పే­ర్కొ­న్నా­రు.

పప్పు బెల్లాలకు అమ్మేసుకున్నారు

1923 నుం­చి 2019 వరకు రా­ష్ట్రం­లో మొ­త్తం 12 మె­డి­క­ల్‌ కా­లే­జీ­లు మా­త్ర­మే ఉం­డే­వి అని జగన్ గు­ర్తు చే­శా­రు. అయి­తే, చం­ద్ర­బా­బు మూ­డు­సా­ర్లు సీ­ఎం­గా పని చే­సి­నా ఒక్క ప్ర­భు­త్వ మె­డి­క­ల్‌ కా­లే­జీ­ని కూడా కట్ట­లే­దు అని ఎద్దే­వా చే­శా­రు. మేం అధి­కా­రం­లో­కి వచ్చాక 17 మె­డి­క­ల్‌ కా­లే­జీ­లు అం­దు­బా­టు­లో­కి తీ­సు­కొ­చ్చామన్నారు.కూ­ట­మి ప్ర­భు­త్వం మె­డి­క­ల్‌ కా­లే­జీ­ల­ను ప్రై­వే­ట్‌ పరం చే­య­డ­మం­టే అవి­నీ­తి­కి పరా­కా­ష్ట అని వై­ఎ­స్‌ జగ­న్‌ అన్నా­రు. పు­లి­వెం­దుల మె­డి­క­ల్‌ కా­లే­జీ­కి NMC 50 సీ­ట్లు అను­మ­తు­లు ఇస్తే చం­ద్ర­బా­బు వద్ద­ని వె­న­క్కి పం­పా­రు అని వై­సీ­పీ చీఫ్ జగన్ పే­ర్కొ­న్నా­రు. ఇం­త­కీ చం­ద్ర­బా­బు మనీ­షా రా­క్ష­సు­డా మీరే ఆలో­చిం­చా­ల­ని తె­లి­పా­రు. మె­డి­క­ల్‌ సీ­ట్లు అం­దు­బా­టు­లో­కి వస్తే, రా­ష్ట్ర ప్ర­జ­ల­కే మేలు జరు­గు­తుం­ది అన్నా­రు. ప్ర­భు­త్వ ఆస్ప­త్రు­లు లే­కుం­డా ప్రై­వే­ట్ దో­పి­డీ­ని ఆపే­ది ఎవరు అని ప్ర­శ్నిం­చా­రు.

Tags:    

Similar News