YS Jagan : తుఫాన్ వెళ్లిపోయాక వచ్చి విమర్శలా.. ఏంటి జగన్ ఇది

Update: 2025-11-05 07:01 GMT

మాజీ సీఎం జగన్ ఇప్పుడు మరీ దారుణంగా వ్యవహరిస్తున్నారు. అధికారం లేకపోయేసరికి.. ఏపీలో ఏం జరిగినా సరే ఫేక్ ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. మొన్న మొంథా తుఫాన్ వస్తుంటే వైసీపీ ఏం ప్రచారం చేసిందో చూశాం. అసలు తుఫాన్ లేదని.. ఇదంతా కూటమి పబ్లిసిటీ హడావిడి అంటూ ముందు దిక్కుమాలిన ప్రచారం చేసింది. చివరకు తుఫాన్ వచ్చి అల్లకల్లోలం చేయడంతో.. ప్లేటు ఫిరాయించేసి.. కూటమి పట్టించుకోలేదంటూ మళ్లీ విమర్శలు మొదలు పెట్టింది. ఇక తుఫాన్ ఉన్నంత కాలం జగన్ బెంగుళూరు ప్యాలెస్ లో సేదదీరారు. తీరా ఇప్పుడు తుఫాన్ వెళ్లిపోయాక తీరిగ్గా ఏపీకి పరామర్శ అంటూ వచ్చారు.

తుఫాన్ రాబోతోందని తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ఏ స్థాయిలో పని చేశారో చూశాం. రాత్రి, పగలు అనే తేడా లేకుండా అధికారులను అలర్ట్ చేసి.. పెద్ద ఎత్తున ముందు జాగ్రత్తలు తీసుకుని.. ఒక్క ప్రాణం పోకుండా చూశారు. పెద్ద ఎత్తున ఆస్తినష్టం జరగకుండా జాగ్రత్త పడ్డారు. ప్రజలకు నిత్యవసర సరుకుల దగ్గరి నుంచి.. చిన్న చిన్న అవసరాల దాకా దగ్గరుండి చూసుకున్నారు. కానీ అప్పుడు కనీసం పట్టించుకోని వైసీపీ నేతలు, జగన్.. ఇప్పుడు రైతులను పరామర్శించడానికి వచ్చాం అని చెబుతూ.. అలవాటు అయిన కామెంట్లు చేశారు. సీఎం చంద్రబాబు ఎక్కడ.. ఇలాంటి టైమ్ లో లండన్ ఎందుకు వెళ్లారు అంటూ జగన్ మాట్లాడారు.

చంద్రబాబు నాయుడు తుఫాన్ రాక ముందు నుంచి.. అది వెళ్లిపోయేదాకా ఏపీలోనే ఉన్నారు. ప్రజల మధ్యే ఉంటూ భరోసా ఇచ్చారు. అందరినీ కాపాడుకున్నారు. తుఫాన్ వెళ్లిపోయాక లండన్ వెళ్లారు. కానీ జగన్ లాగా తుఫాన్ కు భయపడి బెంగుళూరు ప్యాలెస్ లో ఉండిపోలేదు కదా. తుఫాన్ వెళ్లిపోయాక ఏపీకి వచ్చిన జగన్ కూడా చంద్రబాబును విమర్శించడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తుఫాన్ దెబ్బతో ప్రజలు అల్లాడిపోతే వైసీపీ నేతలు ఒక్కరు కూడా ప్రజల్లో తిరగలేదు. వైసీపీ పార్టీ ఎలాంటి ఆర్థిక సాయం చేయలేదు. కానీ కూటమి మీద బురద జల్లడానికి మాత్రం స్క్రిప్టులు రాసుకుని వచ్చేశారు. తుఫాన్ సమయంలో ప్రజల మధ్య ఎవరు ఉన్నారో.. ప్యాలెస్ లో ఎవరు ఉన్నారో అందరికీ తెలుసు జగన్.


Full View

Tags:    

Similar News