గ్రేటర్ విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఉత్కంఠ వీడింది. జనసేన నేత దల్లి గోవిందరెడ్డిని డిప్యూటీ మేయర్ పదవి వరించింది. పార్టీ మారిన వారికి ప్రాధాన్యత దక్కలేదు. డిప్యూటీ మేయర్ పదవి జనసేన ఎగరేసుకెళ్లడంతో టీడీపీ ఆశావాహులు డీలాపడ్డారు. గత నెల 26న అవిశ్వాసం ద్వారా వైసీపీ డిప్యూటీ మేయర్ జియానీ శ్రీధర్ పదవిని కోల్పోయారు. శ్రీధర్ స్థానంలో కొత్త డిప్యూటీ మేయర్ గా దల్లి గోవిందరెడ్డిని ఎన్నుకున్నారు.