తన పాలన, పథకాలే వైసీపీని అధికారంలోకి తెస్తాయని ఆశిస్తున్నారు మాస్ లీడర్, సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఏపీలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఏపీ సీఎం మేమంతా సిద్ధం పేరుతో గత 18 రోజులుగా బస్సు యాత్రను నిర్వహిస్తున్నారు. నేటితో జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర 19వ రోజుకు చేరుకుంది.
జగన్ బస్సు యాత్రకు జనాల నుంచి స్పందన అదుర్స్ అనిపిస్తోంది. మరోవైపు.. ప్రతిపక్షాలకు కూడా జనం భారీగానే వస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండటంతో.. అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తూ సాగిపోతున్నారు జగన్.
ఉదయం 9 గంటలకు గుడిచర్ల నుంచి బస్సు యాత్ర ప్రారంభమై.. మధ్యాహ్నం వరకు నక్కపల్లి పులవర్తి ఎలమంచిలి బైపాస్ మీదుగా అచ్యుతాపురం చేరుకుంటుంది. లంచ్ తర్వాత 3.30కు చింతలపాలెంలో బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. తరువాత బయ్యవరం, కసిం కోట, అనకాపల్లి బైపాస్, అస్కాపల్లి మీదుగా చెన్నయ్యపాలెం వరకు బస్సు యాత్ర కొనసాగుతుంది. రాత్రి చెన్నయ్యపాలెంలో రాత్రి బస శిబిరానికి జగన్ చేరుకుంటారు.