AP: ఏపీలో జోరుగా కోడి పందేలు
బరుల వద్దకు భారీగా చేరుకుంటున్న పందెం రాయుళ్లు.. అడ్డుకునేందుకు పోలీసుల చర్యలు;
సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఏపీలో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని సూరంపల్లి, రామవరప్పాడు, అంపాపురంలో, ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో కోడి పందేలను నిర్వహిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదఅమిరంలో కోడి పందేలను డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు ప్రారంభించారు. కోడి పందేలను చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు.
కోడి పందేలను అడ్డుకునేందుకు ఏఐ
ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా నిర్వహించే కోడి పందేలను అడ్డుకునేందుకు ఏపీ పోలీసులు ఏఐ, డ్రోన్లను రంగంలోకి దించారు. అధునాతన నిఘా సాంకేతికత ద్వారా.. కోడి పందేళ్లు ఎక్కడ జరుగుతున్నాయో గుర్తించి వాటిని నిరోధించనున్నారు. కోడి పందేలను నిర్వహించిన... వాటిలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఇప్పటికే హెచ్చరించారు.
మొదలైన కోడి పందాలు
తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెంలో కోడిపందాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు సుబ్బరాజు కోడి పందాలు ప్రారంభించారు. నిన్నటి వరకు పోలీసులు ప్రభుత్వ యంత్రాంగం పందాలు నిర్వహించకూడదని చట్ట వ్యతిరేకమని ఎన్నో ప్రసారాలు చేశారు. చాలా మందిపై బైండోవర్ కేసులు కూడా పెట్టారు. చివరకు చట్టంపై సాంప్రదాయం అంటూ కోడి గెలిచింది లక్షల్లో పందాలకు సిద్ధమైంది.