Leopard : తిరుమలలో మళ్లీ చిరుత సంచారం.. హడలెత్తిన భక్తులు..

Update: 2025-07-17 08:00 GMT

తిరుమలలో చిరుతపులులు తరచూ కనిపిస్తూ భక్తులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే ఎన్నోసార్లు పులులు రోడ్లపైకి వచ్చి అందరిని హడలెత్తించాయి. సెక్యూరిటీ అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్న ఇనుపకంచెలు దాటి మరీ అడవిలో నుండి బయటకు వస్తున్నాయి చిరుత పులులు. తాజాగా మరో చిరుత భక్తులను భయాందోళనకు గురిచేసింది. ఈ ఉదయం 5.30 గంటల సమయంలో అలిపిరి జూపార్క్ వద్ద చిరుత సంచరించింది. ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ ఏర్పాటు చేసిన ఇనుప కంచె దాటుకుని రోడ్డుపైకి వచ్చి హల్ చల్ చేసింది. అక్కడినుంచి అరవింద్ కంటి ఆసుపత్రి వద్దకు వెళ్లినట్లుగా అధికారులు గుర్తించారు. కాగా ఉదయాన్నే దర్శనానికి వెళ్లే భక్తులు చిరుతను చూసి పరుగులు పెట్టారు. చిరుత సంచరించిన ఫుటేజీ అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది.

Tags:    

Similar News