ఏపీలో మందుబాబులకు మంచి కిక్కిచ్చే న్యూస్. 11 మద్యం కంపెనీలు బేస్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఫలితంగా ఆయా కంపెనీల నుంచి రాష్ట్ర బెవరేజస్ సంస్థ మద్యం కొనే ధర తగ్గింది. ఆయా బ్రాండ్లను బట్టి ఒక్కో క్వార్టర్ ధర ఎమ్మార్పీపై రూ.30 వరకూ తగ్గడంతో ఆ మేరకు వినియోగదారులకు ఊరట కలగనుంది. దీంతో ఒక్కో క్వార్టర్‌పై రూ.30, ఫుల్ బాటిల్‌పై సుమారు రూ.90-120 వరకు ధరలు తగ్గాయి. మాన్షన్ హౌస్, రాయల్ ఛాలెంజ్, యాంటిక్విటీ సహా పలు బ్రాండ్లు ఇందులో ఉన్నాయి. త్వరలోనే న్యూఇయర్, సంక్రాంతి పండుగలు రానుండటంతో ధరల తగ్గింపుపై మందుబాబులు సంబరపడుతున్నారు.