Nara Lokesh : లోకేష్‌ నిజమైన నాయకత్వం.. ఇది కదా కావాల్సింది..

Update: 2025-10-16 05:35 GMT

నిజమైన నాయకుడు అంటే ఎలా ఉండాలి.. తన రాష్ట్రం బాగుంటే చాలు అనుకోవాలి. ఎవరి వల్ల మంచి జరిగినా సరే దాన్ని అంగీకరించాలి. ఆ క్రెడిట్ వాళ్లకు ఇవ్వాలి. ఇప్పుడు లోకేష్ అధికారంలో ఉండి ఇలాంటి మాటలే చెబుతున్నారు. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ ను తీసుకురావడంలో లోకేష్ పాత్ర ఎనలేనిది. ఎన్ని ప్రధాన సిటీలు పోటీపడినా సరే వైసీపీ హయాంలో విధ్వంసం అయిన విశాఖకు ప్రపంచ మేటి కంపెనీని తీసుకొచ్చారు. కానీ వైసీపీ నేతలు మాత్రం దీనిపై రకరకాలుగా మాట్లాడుతున్నారు. దీని వల్ల ఉపయోగం లేదని, వాతవారణం పొల్యూట్ అవుతుందని కొందరు అంటున్నారు. ఇక్కడే మరికొందరు వైసీపీ నేతలు మాత్రం.. ఇది తాము ఎన్నడో చేయాలని చూశామని.. ఈ లోగా ఎన్నికలు రావడం వల్ల ఆగిపోయిందంటున్నారు.

అంటే వాళ్లది వాళ్లకే క్లారిటీ లేదు. పైగా ఏపీకి పెట్టుబడులు వస్తుంటే అభినందించాల్సింది పోయి ఇలా అడ్డంకిగా మాట్లాడుతున్నారు. అదే మంత్రి లోకేష్ మాత్రం.. తాను అధికారంలో ఉన్నంత మాత్రాన ఎవరినీ తక్కువగా చూడనంటున్నారు. తనకు ఉన్న పరిచయాలతో ఏపీకి కంపెనీలు తీసుకు వస్తున్నానని.. ఒకవేళ వైసీపీ వాళ్లకు ఏ కంపెనీలతో అయినా పరిచయాలు ఉంటే చెప్పాలని అడుగుతున్నారు. తనకు ఎక్స్ లో వైసీపీ వాళ్లు మెసేజ్ చేస్తే తాను వెళ్లి ఆ కంపెనీలతో మాట్లాడి ఏపీకి తీసుకొస్తానంటున్నారు. అవసరం అయితే ఆ కంపెనీల ఇన్ఫర్మేషన్ ఇచ్చిన క్రెడిట్ వైసీపీ వాళ్లకే ఇస్తానంటున్నారు. తనకు కావాల్సింది ఏపీ అభివృద్ధి కావడమే తప్ప.. తనకు ఏదో క్రెడిట్ దక్కాలనేది కాదంటున్నారు.

ఇదే కదా ఒక నిజమైన నాయకుడికి ఉండాల్సిన లక్షణం. వైసీపీ వాళ్లు ఏదైనా కంపెనీ ఇన్ఫర్మేషన్ చెబితే తాను మాట్లాడి తెస్తానని ఆ క్రెడిట్ వాళ్లకే ఇస్తానంటున్నారు. అదే గూగుల్ డేటా సెంటర్ వస్తే ఆ క్రెడిట్ లోకేష్‌ కు ఇవ్వడానికి వైసీపీ రెడీగా ఉందా అంటే లేదు. పైగా ఆ డేటా సెంటర్ వల్ల లాభం లేదన్నట్టు నిప్పులు పోసుకుంటున్నారు. ఇక్కడే అర్థమైపోతుంది కదా ఒక నిజమైన నాయకుడికి.. అధికారం కోసం మాత్రమే మాట్లాడే వారికి ఉన్న తేడా ఏంటి అనేది. మంత్రి గుడివాడ అమర్ నాథ్ మాట్లాడుతూ.. గూగుల్ డేటా సెంటర్ వల్ల పెద్దగా లాభం లేదు అని చెప్పడాన్ని బట్టి చూస్తే ఆయనకు ఐటీ మీద ఏ మాత్రం అవగాహన ఉందో ఇట్టే అర్థమైపోతుందని యూత్ తిట్టిపోస్తున్నారు. ఇప్పటికైనా వైసీపీ ఇలాంటి మాటలు మానుకుని వస్తున్న కంపెనీలకు వెల్కమ్ చెప్పాలంటున్నారు.


Full View

Tags:    

Similar News