Lokesh: 147వ రోజుకు చేరిన యువగళం పాదయాత్ర

1900 కిలో మీటర్లు పూర్తి చేసుకున్నందుకు సాలుచింతలలో శిలాపలకం ఆవిష్కరిస్తారు.;

Update: 2023-07-05 08:30 GMT

లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. ఇవాళ్టితో పాదయాత్ర 147 రోజుకు చేరింది. ఇప్పటి వరకు 1901 కిలోమీటర్లు నడిచారు లోకేష్. ప్రస్తుతం నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. మధ్యాహ్నం సాలుచింతల విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు.1900 కిలో మీటర్లు పూర్తి చేసుకున్నందుకు సాలుచింతలలో శిలాపలకం ఆవిష్కరిస్తారు.అనంతరం బీడీ కాలనీలో బీడీ కార్మికులతో సమావేశమవుతారు. ఆ తర్వాత పడుగుపాడు మసీద్‌ వద్ద స్థానికులతో సమావేశమవుతారు.కోవూరు బజార్ వద్ద స్థానికులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకుంటారు. అనంతరం మండబైలు సెంటర్‌లోని మీ సేవా కార్మికుల సమస్యలు వింటారు.అనంతరం గుమ్మలదిబ్బ ఎస్టీ కాలనీలో ఎస్టీలతో నూ, ఆ తర్వాత పాతూరు వద్ద చేనేతలతోనూ సమావేశవుతారు. దామరమడుగులో యువతతో భేటీ అవుతారు. అనంతరం ఆర్ ఆర్ నగర్‌లో స్థానికులతో సమావేశమై వారి సమస్యలు తెలుకుంటారు. అనంతరం కాగులపాడు గ్రామస్థులతో సమావేశమవుతారు. అనంతరం రేబల జంక్షన్‌లో స్థానికులతో మాట్లాడుతారు.ఇవాళ రాత్రి చెల్లాయపాలెం విడిది కేంద్రంలో బస చేస్తారు.

Tags:    

Similar News