Fire Accident : గోవిందరాజస్వామి వారి ఆలయం వద్ద భారీ అగ్నిప్రమాదం

Update: 2025-07-03 11:30 GMT

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం వద్ద భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అర్థరాత్రి 1.30 గంటల ప్రాంతంలో ఆలయం ఎంట్రన్స్ లో దుకాణాలకు వేసుకున్న పందిరి మంటల్లో పూర్తిగా దగ్థమైంది. . భక్తులు పెద్దగా లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఓ దుకాణంలో విద్యుదాఘాతం కారణంగానే అగ్ని ప్రమాదం సంభవించినట్టు అధికారులు గుర్తించారు.రెండు ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదం పై వివరాలు తెలియాల్సి ఉంది. గతంలో కూడా ఇదే ప్రాంతంలో మంటలు వ్యాపించి ఓ ఫొటోషాపు పూర్తిగా దగ్థమైంది. 

Tags:    

Similar News