అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పెద బొడ్డేపల్లి మార్కెట్ యార్డ్ లో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ప్రైవేటు వ్యక్తికి చెందిన పసుపు మార్కెట్ యార్డ్ లో నిల్వఉంచగా ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ గోడౌన్ లో పసుపు బస్తాలు నిల్వ ఉంచి మిషనరీతో పసుపును శుద్ధి చేసి ఎగుమతి చేస్తూ ఉంటారు. ప్రమాదం ఎలా సంభవించిందో తెలియదు గానీ భారీ ఆస్తి నష్టం జరిగింది మార్కెట్ యార్డ్ సిబ్బంది నర్సీపట్నం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా ఉటాహుటిన వచ్చి మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో పసుపు బస్తాలు మిషనరీ పూర్తిగా కాలి బూడిదయ్యాయి గొడవను పాతది కావడంతో కూలిపోయే ప్రమాదం ఉంది... ప్రమదం షార్ట్ సర్క్యూట్ కారణమై ఉంటదని కొందరు అంటున్నారు.