AP : ఏపీలో కూటమికి మందకృష్ణ మద్దతు

Update: 2024-03-19 07:53 GMT

లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) వేళ అందివచ్చే అన్ని వర్గాలను దగ్గరచేసుకుంటున్నాయి పార్టీలు. ఆంధ్రప్రదేశ్ లో (AP) ఎమ్మార్పీఎస్ ఓ కీలక ప్రకటన చేసింది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు జరిగిందన్నారు. జగన్ ప్రభుత్వంలో ఉమ్మడి దళితులకు అన్యాయం జరిగిందని చెప్పారు.

జగన్మోహన్ రెడ్డి (CM Jagan) ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకి అని మందకృష్ణ మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమని అన్నారు. వైసీపీ పాలనలో విద్య, ఉద్యోగం, సంక్షేమం, రాజకీయంగా దళితులకి అన్యాయం జరిగిందని మండిపడ్డారు. అంబేద్కర్ విదేశీ విద్యకి జగన్ పేరు పెట్టడం దుర్మార్గమన్నారు. దళితుల చదువులకి జగన్ సొంత సొమ్ము చెల్లించడం లేదని… ప్రభుత్వ సొమ్మును వినియోగిస్తున్నారని చెప్పారు.

విదేశీ విద్యకి జగన్ పేరు మంచిదేనని జూపూడి మాట్లాడటం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని మందకృష్ణ మాదిగ విమర్శిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎస్సీ వర్గాలకు కేంద్రం సపోర్ట్ చేసింది. కమిటీని నియమించింది. ప్రధాని మోదీ ఆధ్యక్షతన .. ఎమ్మార్పీఎస్ సభను కూడా మందకృష్ణ నిర్వహించారు.

Tags:    

Similar News