Andhra Pradesh : ఏపీలో భారీగా డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు...

Update: 2025-08-05 06:30 GMT

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందడంలో కీలకంగా వ్యవహరించే ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. తాజా ఉత్తర్వుల ప్రకారం నెల్లూరు జిల్లా కందుకూరు సబ్ కలెక్టర్ గా హిమవంశీ, మన్యం జిల్లా పాలకొండ సబ్ కలెక్టర్ గా పవార్ సప్నిల్, ఏలూరు జిల్లా నూజివీడు సబ్ కలెక్టర్ గా వినూత, అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ గా కళ్యాణి, రాజంపేట సబ్ కలెక్టర్ గా హెచ్ఎస్ భావన, అల్లూరి జిల్లా రంపచోడవరం సబ్ కలెక్టర్ గా నోక్వల్, పార్వతీపురం సబ్ కలెక్టర్ గా ఆర్.వైశాలి నియమితులయ్యారు.

Tags:    

Similar News