Mega Parent Teacher Meeting : మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ .. సీఎం చంద్రబాబు హాజరు

Update: 2025-07-09 08:15 GMT

జూలై 10వ తేదీన విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కు సంబంధించి అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. సమావేశ ప్రాంగణాన్ని కలెక్టర్ చేతన్, ఎమ్మెల్యే సింధూర రెడ్డి, ఎస్పీ రత్న, మాజీమంత్రి పల్లె రఘునాథ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లోనూ ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. రాష్ట్రస్థాయి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో కొత్తచెరువుకు 10వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచ్చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఎమ్మెల్యే సింధూర రెడ్డి మాట్లాడుతూ తల్లికి వందనం నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ కావడంతో అందరూ సీఎం చంద్రబాబుతో సమావేశం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని తెలియజేశారు. ఇంట్లో ఎందరు పిల్లలు చదువుతుంటే అందరికీ తల్లికి వందనం ద్వారా ఒక్కొక్కరికి 13 వేల రూపాయలు చొప్పున నిధులు జమ చేసినట్లు తెలిపారు. ఎస్పీ రత్న మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు విద్యార్థుల తల్లిదండ్రులతో నిర్వహించనున్న సమావేశం నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టినట్లు తెలియజేశారు.

Tags:    

Similar News