Nara Lokesh : ప్రతి ఏటా డీఎస్సీ.. నిరాశ పడొద్దన్న మంత్రి లోకేశ్

Update: 2025-09-15 08:32 GMT

ఏపీ మెగా డీఎస్సీలో అర్హత పొందిన అభ్యర్థులందరికీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు. మెగా డీఎస్సీ తుది ఎంపిక జాబితా విడుదలైన సందర్భంగా ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. "మెగా డీఎస్సీ వాగ్దానం నెరవేరింది. ఈ మైలురాయి నా బాధ్యతను మరింత పెంచింది" అని లోకేశ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. అలాగే, ఈసారి జాబితాలో పేరు లేని అభ్యర్థులు నిరుత్సాహపడొద్దని, హామీ ఇచ్చినట్లుగా ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని భరోసా ఇచ్చారు.

ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైల్‌పైనే చేశారని లోకేశ్ గుర్తుచేశారు. ఈ నిర్ణయం ప్రభుత్వం విద్యారంగానికి ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తుందని ఆయన అన్నారు. మెగా డీఎస్సీ తుది ఎంపిక జాబితాను విద్యార్థులు మరియు అభ్యర్థులందరూ అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని తెలిపారు.

Tags:    

Similar News