ఏపీ మంత్రి నారాయణ సింగపూర్ పర్యటన ముగించుకొని మలేషియా చేరుకున్నారు. సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబుతో కలిసి ఆయన కౌలాలంపూర్‌లో పర్యటించనున్నారు. అమరావతి నిర్మాణానికి సంబంధించి ఆ దేశంలో ఉన్న ఉత్తమ పద్ధతులపై స్టడీ చేయనున్నారు. అక్కడి అధికారులతో కలిసి వరద నివారణ చర్యలు, అర్బన్ డెవలప్‌మెంట్, ఐకానిక్ స్కై స్క్రాపర్, పెట్రోనాస్ ట్విన్ టవర్స్, పిరమిడ్ మాల్, కన్వెన్షన్ సెంటర్లను పరిశీలించనున్నారు. ఆ తర్వాత మలేసియా పరిపాలన రాజధాని పుత్రజయ నిర్మాణంపై అధ్యయనం చేస్తారు. పుత్రజయలో ప్రభుత్వ పాలన భవనాల నిర్మాణాలు, మౌలిక వసతులు, టెక్నాలజీ పార్కులను మంత్రి నారాయణ పరిశీలించనున్నారు.