AP : కేంద్ర ప్రముఖులతో భేటీ అవుతూ ఏపీ ఎమ్మెల్యే హల్చల్

Update: 2024-06-08 08:43 GMT

దేశ రక్షణ రంగంలో సభ్యుడిగా ఉన్న ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో శుక్రవారం భేటీ అయ్యారు. ఆదోని అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా గెలుపొందిన తర్వాత దేశంలోని ప్రముఖులతో భేటీ అవుతున్నారు.

ఆదోనిలో పోటీ చేసినపుడు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, బిజెపి జాతీయ అధ్యక్షుడు జె పి నడ్డా ను ప్రచారానికి పిలిపించారు పార్థసారథి. అలా ప్రచారంలోనే తన మార్కును ప్రజలకు చూపించారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంగా దేశ రాష్ట్రపతి తో భేటీ కావడం విశేషం.

ఆదోని ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంటానని పార్థసారథి అంటున్నారు.

Tags:    

Similar News