తెలుగుదేశం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తాను ఎంపీగా అందుకున్న తొలి జీతాన్ని రాజధాని అమరావతి నిర్మాణానికి విరాళంగా అందించారు. తనకు వచ్చిన నెల జీతం రూ. లక్షా 57వేల చెక్కును సీఎం చంద్రబాబుకు అందించారు. ఎంపీ అప్పలనాయుడిని చంద్రబాబు అభినందించారు.
ఎంపీగా ఎన్నికైన తర్వాత తొలిసారి పార్లమెంట్ కు సైకిల్ పై వెళ్లిన అప్పలనాయుడు అందరి దృష్టిని ఆకర్షించారు. అయిదేళ్ల తర్వాత రాష్ట్రప్రజలకు స్వాతంత్య్రం వచ్చిందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా రాష్ట్ర పునర్నిర్మాణానికి జగన్ సహకరించాలన్నారు.