సీఎం జగన్ ఢిల్లీ నుంచి తోకముడిచి వచ్చారు : రామ్మోహన్ నాయుడు
ఎన్డీఏలో చేరితే ఏ మంత్రి పదవులు వస్తాయన్న ఉత్సాహం తప్ప.. రాష్ట్ర ఎంపీలకు ప్రజల సమస్య పట్టడం లేదని ఆరోపించారు..;
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ నుంచి తోకముడిచి వచ్చారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. 40 నిమిషాలపాటు ప్రధానితో చర్చించిన సీఎం జగన్ ఏం మాట్లాడారో ఎందుకు ప్రజలకు చెప్పలేకపోయారని ప్రశ్నించారు. గత 18 నెలలుగా ప్రత్యేక హోదాపై ఎలాంటి పోరాటం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎప్పటిలోగా ప్రత్యేక హోదా సాధిస్తారో స్పష్టం చేయాలని రామ్మోహన్ నాయుడు నిలదీశారు.
రాష్ట్ర సమస్యలపై ఢిల్లీలో పోరాటం చేయకుండా.. సీబీఐ కేసుల కోసం ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.. టీడీపీ నేతలపై నిజంగా చేసే ఆరోపణలకు ఆధారాలు ఉంటే కోర్టులు వైసీపీ వైపే ఉంటాయన్నారు. ఎన్డీఏలో చేరితే ఏ మంత్రి పదవులు వస్తాయన్న ఉత్సాహం తప్ప.. రాష్ట్ర ఎంపీలకు ప్రజల సమస్య పట్టడం లేదని ఆరోపించారు రామ్మోహన్ నాయుడు.