ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘నాడు-నేడు’ పథకం పేరును చంద్రబాబు ప్రభుత్వం మార్చింది. ఇక నుంచి స్కూల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్‌మెంట్ (SII) పేరుతో ఆ స్కీమ్‌ను అమలు చేయనుంది. అన్ని పాఠశాలల్లో ఏడాదిలోపు మౌలిక సదుపాయాలు కల్పించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలను అమలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పథకాల పేర్లను సైతం ఎన్డీఏ ప్రభుత్వం మార్చేసింది. ఈ పథకాలను ఇకపై‘పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్’గా పిలవాలని ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి‘అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి’గా పేరు మార్చింది. డా.బి.ఆర్ అంబేద్కర్ పేరు తొలగించడంపై నాడు చంద్రబాబు నాయుడు ( CM Chandrababu Naidu ), పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ), నారా లోకేశ్‌లు ( Nara Lokesh ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
అయినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదు. అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకానికి జగనన్న విదేశీ విద్యా దీవెన పథకంగా మార్చేశారు. మరోవైపు వైఎస్ఆర్ కల్యాణమస్తు పథకానికి సైతం పేరు మార్చేశారు. 2019లో అమలు చేసిన‘చంద్రన్న పెళ్లి కానుక’గా పేరు మారుస్తూ ఉత్తర్వులు వెల్లడయ్యాయి. మరోవైపు వైఎస్ఆర్ విద్యోన్నతి పథకానికి‘ఎన్టీఆర్ విద్యోన్నతి’అని పేరు...జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకం పేరును‘సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రోత్సాహకం’గా నామకరణం చేశారు.