Nandamuri Taraka Rama Rao : రాజకీయాల్లో సీనియర్ ఎన్టీఆర్ నిబద్ధత.. ఎందరికో ఆదర్శం..
సీనియర్ ఎన్టీఆర్ అంటేనే ఒక చరిత్ర. ఎంత చెప్పినా ఇంకా మిగిలే ఉంటుంది. సినిమాల్లో ఎవర్ గ్రీన్ అనిపించుకున్న ఆయన.. రాజకీయాల్లోకి వచ్చి అదే స్థాయిలో సక్సెస్ అయ్యారు. టీడీపీని పెట్టిన కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకురావడం కేవలం సీనియర్ ఎన్టీఆర్ కు మాత్రమే దక్కింది. ఆయన సీఎం అయ్యాక ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. 2 రూపాయలకు కిలో బియ్యంతో పాటు విద్యుత్ ఛార్జీలు తగ్గించి.. గుడ్ గవర్నెన్స్ లాంటివి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఆయన ఎంతో మందికి టికెట్లు ఇచ్చారు. కానీ ఎన్నడూ డబ్బులు, బ్యాక్ గ్రౌండ్ చూసి ఇవ్వలేదు.
ఎక్కువగా చదువుకున్న వారినే ఎంకరేజ్ చేశారు. బీసీలు, ఎస్సీలను ఎక్కువగా రాజకీయాల్లో ఎంకరేజ్ చేశారు. ఎవరైనా ఇతర పార్టీలో గెలిచి టీడీపీలోకి వస్తానంటే.. పదవికి రాజీనామా చేసి రమ్మన్న చరిత్ర కేవలం ఎన్టీఆర్ కే దక్కింది. ఎన్టీఆర్ ఎంతో మంది సామాన్యులకు టికెట్లు ఇచ్చి గొప్ప నాయకులుగా తీర్చిదిద్దారు. ఎంతో మంది టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలిచినా.. ఆటోల్లో తిరిగేవారు. అంత గొప్పగా రాజకీయాలను సాగించిన చరిత్ర కేవలం సీనియర్ ఎన్టీఆర్ కే దక్కింది.
ఆయన కేవలం కమర్షియల్ రాజకీయాలు చేయకుండా.. ప్రజలకు ఏది ఉపయోగపడుతుందో దాన్నే నమ్మారు. అలాంటి రాజకీయాలే చేశారు. ఎంత మంది ఒత్తిడి చేసినా సరే పనిచేసే నాయకులను మాత్రమే ఎంకరేజ్ చేశారు. ఎవరైనా తప్పు చేస్తే సొంత పార్టీ నేతలు అయినా సరే వదిలిపెట్టకుండా చర్యలు తీసుకున్నారు సీనియర్ ఎన్టీఆర్. ఆయన మార్గదర్శకాలను ఇప్పటి పార్టీలు కచ్చతంగా ఫాలో కావాల్సిన అవసరం ఉందని అంటున్నారు రాజకీయ నిపుణులు.