Nara Bhuvaneshwari : ఆడపిల్లలంటే ఆట వస్తువులు కాదు.. వైసీపీ నేతలకు నారా భువనేశ్వరి స్ట్రాంగ్ కౌంటర్
Nara Bhuvaneshwari : వైసీపీ నేతలకు స్ట్రాంగ్‌కౌంటర్ ఇచ్చారు నారా భువనేశ్వరి. ఆడపిల్లలంటే ఆట వస్తువులు కాదని, పనిలేక మాపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.;
Nara Bhuvaneshwari : వైసీపీ నేతలకు స్ట్రాంగ్‌కౌంటర్ ఇచ్చారు నారా భువనేశ్వరి. ఆడపిల్లలంటే ఆట వస్తువులు కాదని, పనిలేక మాపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సమాజానికి ఉపయోగం లేని విమర్శలెందుకని అధికార పార్టీ నాయకులను ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను, ప్రస్తుత ఏపీని తన భర్త ఏ విధంగా అభివృద్ధి చేశారో, అందుకోసం ఎంతగా కష్టపడ్డారో తనకు మాత్రమే తెలుసునన్నారు. ఏపీ రాజధానిగా అమరావతి ఉండాలి.. ఉంటుందన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ప్రజాసేవకే అంకితమవుతానని స్పష్టం చేశారు.