Nara Lokesh : నేడు ఆదోనీలో యువగళం పాదయాత్ర

Update: 2023-04-21 04:45 GMT

కర్నూలు జిల్లాలో నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. ఇవాళ 77వ రోజుకు చేరింది. నేడు వెయ్యి కిలోమీటర్ల మైలు రాయిని దాటనన్నారు లోకేష్. కాసేపట్లో ఆదోని క్యాంప్ సైట్ నుంచి లోకేష్‌ పాదయాత్ర ప్రారంభమవుతుంది. లోకేష్ వెంట జనం తండోపతండాలు వస్తున్నాయి. ఆయనతో తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. సెల్ఫీలు దిగితున్నారు

అంతమకుందు ఆరేకల్లులో మైనార్టీలతో సమావేశయ్యారు లోకేష్‌. రాష్ట్రంలో మైనార్టీలపై జగన్‌ రెడ్డికి ఎందుకింత కక్ష అని ప్రశ్నించారు.. ముస్లిం, మైనార్టీలపై జగన్‌ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు సాక్షీ భూతం అర్థంతరంగా నిలిచిపోయిన మైనార్టీ ఉర్దూ ఐటీఐ రెసిడెన్షియల్‌ కాలేజీని చూపిస్తూ సెల్పీ దిగారు. టీడీపీ హయాంలో ఏడు కోట్లు నిధులు కేటాయించి నిర్మాణ పనులు కూడా ప్రారంభించామన్నారు.. వైసీపీ వచ్చాక నాలుగేళ్లుగా ఈ నిర్మాణాలను కూడా ముందుకు సాగనీయకుండా పాడు పెట్టారని మండిపడ్డారు.. కొత్తగా పనులు చేపట్టడం ఎలాగూ చేతకాదని. గతంలో ప్రారంభించిన పనులైనా పూర్తిచేయలేని దద్దమ్మ పనులైనా పూర్తిచేయలేని దద్దమ్మ ముఖ్యమంత్రి జగన్‌ అంటూ లోకేష్‌ ఎద్దేవా చేశారు..

Tags:    

Similar News