Nara Lokesh : గ్రూప్-1లో సర్కారు వారి పాట ఎంత? నారా లోకేష్
Nara Lokesh : ఏపీపీఎస్సీ గ్రూప్ వన్‌లో అవకతవకలు జరిగాయంటూ... జగన్ సర్కారుపై మండిపడ్డారు టీడీపీ నేత నారా లోకేష్.;
Nara Lokesh : ఏపీపీఎస్సీ గ్రూప్ వన్‌లో అవకతవకలు జరిగాయంటూ... జగన్ సర్కారుపై మండిపడ్డారు టీడీపీ నేత నారా లోకేష్. గ్రూప్-1లో సర్కారు వారి పాట ఎంత? అని ప్రశ్నించారు లోకేష్. ఏ 1 నిర్వహణలో గ్రూప్-1లో గూడుపుఠాణీ జరిగిందని....డిజిటల్, మాన్యువల్ వాల్యుయేషన్‌లో భారీ తేడాలు వచ్చాయన్నారు.
తెలుగు మీడియం అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందన్న ఆయన.. . స్పోర్ట్స్ కోటాలో కోతలతో ఆశావహులు ఆందోళనతో ఉన్నారన్నారు. అవకతవకలపై గవర్నర్ దృష్టిసారించి న్యాయవిచారణ జరపాలని డిమాండ్ చేశారు.
గ్రూప్ 1 ఇంటర్య్వూల ఎంపికలోప్రతిభావంతులకు అన్యాయం జరిగింది.... జగన్ సర్కారు వారి పాట ఆట కట్టిస్తామన్నారు లోకేష్. 30కి పైగా సీబీఐ, ఈడీ కేసుల్లో ఏ1 నిందితుడిగా వున్న జగన్ నిర్వహణలోనే... గ్రూప్ 1 కూడా అవకతవకలతోనే సాగిందని మండిపడ్డారు.